తెలంగాణ ఉద్యమ ప్రధాన లక్ష్యమైన ‘నీళ్ల’ విషయంలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా విభజన సమయంలో కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు ఉండేలా కేసీఆర్ సంతకం చేయడం ఏపీకి వరంగా మారిందని అన్నారు. ఆ తప్పులను సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.