W.G: ఆకివీడులో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నూతన ఏడాది క్యాలెండర్ను పట్టణ కమిటీ ఆవిష్కరించింది. జిల్లా అధ్యక్షురాలు ఉదయకుమారి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వార్డు స్థాయిలో మహిళలకు ముగ్గులు, మ్యూజికల్ చైర్స్ వంటి క్రీడా పోటీలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు డి. లక్ష్మి, పద్మ పాల్గొన్నారు