MBNR: గండీడ్ మండలం కొంరెడ్డిపల్లికి చెందిన బీజేవైఎం అధ్యక్షుడు వేముక రవీందర్, వార్డు మెంబర్ శ్రీను, బీజేపీ నాయకులు కటికే వెంకటేశ్ తదితరులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.