BHPL: తెలంగాణా తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు.