VZM: ముందస్తు చర్యలతో జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని SP దామోదర్ గురువారం తెలిపారు. కీలక కూడళ్లలో పోలీసు పికెట్లు, వాహన తనిఖీలు, పెట్రోలింగ్ చేపట్టామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 11, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 17, MV చట్టం ఉల్లంఘనలపై 87 కేసులు నమోదయ్యాయని చెప్పారు.