GNTR: నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలకు ఉత్తమమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని జిల్లా పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.