SKLM: జిల్లా మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా 100 మంది జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.పైడి సింధూర హాజరై హెల్మెట్ల పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించి బాధ్యతగా వాహనాలు నడపండి, కుటుంబ భద్రత పెరుగుతుందని పిలుపునిచ్చారు.