HNK: డ్రైవర్లు జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని డీటీవో వేణుగోపాల్ తెలిపారు. వరంగల్ రీజియన్ పరిధిలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం హనుమకొండ డిపోలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. సురక్షిత డ్రైవింగ్ చేసి జీరో ఆక్సిడెంట్ దిశగా సేవలందించాలని డ్రైవర్లకు సూచించారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లను సన్మానించారు.