గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అమరావతి రోడ్లోని రేషన్ దుకాణాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కార్డుదారులతో మాట్లాడి సరుకుల పంపిణీపై ఆరా తీశారు. రేషన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని, అక్రమాలను అరికట్టేందుకు ప్రతి దుకాణంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామనీ స్పష్టం చేశారు.