కృష్ణా: పల్లె పండుగ-2 కార్యక్రమంలో భాగంగా రూ.కోటీ 90 లక్షలతో ఆరు రోడ్లు నిర్మిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో ఉపాధి పథకం నిధులు రూ.91లక్షలతో రెండు కిలోమీటర్ల మోదుమూడి ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి ప్రారంభించారు.