VSP: జనవరి 4న విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. పరవాడ ఫార్మాసిటీలో ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభల్లో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణపై చర్చిస్తామని తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.