NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలో జనవరి 1 నుంచి 31 వరకు నెలరోజుల పాటు కార్యక్రమాలు జరుగనున్నాయి. డిపో మేనేజర్ ఏ.యాదయ్య అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. DTO బాలు, RTA జిల్లా మెంబర్ భూపాల్ రెడ్డి డ్రైవర్లకు భద్రతా సూచనలు ఇచ్చారు. సెల్ ఫోన్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలియపరిచారు.