ASR: అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ 2026 నూతన సంవత్సరంలో అందరికి మంచి జరగాలని, విద్యార్ధినులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచారు. విద్యార్థినులు, వైస్ ప్రిన్సిపాల్ శశికుమార్, అధ్యాపకులు ఉత్సాహంగా వేడుకలలో పాల్గొన్నారు.