BPT: చీరాల మండలం బోయిన వారి పాలెం గ్రామంలో పోలు రాధా ఎడ్ల బండి పోటీలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని పోటీలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కమిటీ సభ్యులు ప్రతి ఏడాది ఎడ్ల పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలలో ప్రజలందరూ పాల్గొని ఆనందంగా గడపాలని కోరారు.