ASR: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కొయ్యూరు ఎంఈవో ఎల్.రాంబాబు, ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వేంపాటి తలుపులు, జనరల్ సెక్రటరీ గోరా పంతులు, గౌరవ అధ్యక్షుడు మురళీ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు ఎంఈవోను కలిశారు. ముందుగా ఎంఈవో చేతుల మీదుగా క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలన్నారు.