VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ కోష్ట నేషనల్ హైవే పక్కన ఉన్న శ్రీ రాధాకృష్ణ గోసేవా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్ర పరిపాలనలో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో, సుఖ సంతోషాలతో అందరి జీవితాలలో కొత్త ఆశలు, ఆనందాలతో వెలుగులు నింపాలని కోరుకున్నట్లు తెలిపారు.