KRNL: నాగలదిన్నె జడ్పీ హైస్కూల్లో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహితీవేత్త గద్వాల సోమన్న రచించిన ‘వెన్నెల నవ్వింది’ పుస్తకాన్ని హైదరాబాద్లో ఘనంగా ఇవాళ ఆవిష్కరించారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా పద్మశ్రీ డా. కొలకలూరి ఇనాక్, విడి. రాజగోపాల్, విశ్రాంత అటవీ శాఖ అధికారి ఏఎల్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.