CTR: గుడిపాల మండలం రెట్టగుంట గ్రామానికి చెందిన ఓంశక్తి మాలధారణ భక్తులు మేల్మరువత్తూరు వెళ్లి రావడానికి ‘జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి ఈ బస్సు యాత్రను జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఓంశక్తి భక్తులు పాల్గొన్నారు.