నూతన సంవత్సరం వేళ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో, క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ఎటెర్నెల్కు చెందిన ఈ రెండు సంస్థలూ డిసెంబర్ 31న ఒక్కరోజే సంయుక్తంగా 75 లక్షల ఆర్డర్లు అందుకున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం తమ కార్యకలాపాలపై పడలేదని పేర్కొన్నారు.