MBNR: చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ తెలంగాణ పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి జిల్లాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కురుమూర్తి వాస గోవిందా నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగింది.