కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరినీ కర్నూల్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎస్పీ పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, ప్రజాసేవ, పాలన సమన్వయానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.