KMM: నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి పెన్స్, పుస్తకాలను బహుమతిగా స్వీకరించారు.