SRD: రహదారి భద్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో గురువారం పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నెల రోజులపాటు భద్రత మహోత్సవాలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో ప్రమాదాలు జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.