KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇవాళ పత్తి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మార్కెట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మార్కెట్కు రైతులు 3 వాహనాల్లో 22 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకురాగా, గరిష్ఠ ధర రూ.7,300 వేలు, కనిష్ఠ ధర రూ. 6,700 వేలు పలికిందన్నారు. రైతులు తమ పంటను మార్కెట్కు తెచ్చేటప్పుడు తేమ లేకుండా, నాణ్యమైన పత్తిని తీసుకురావాలన్నారు.