TG: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. అన్నంలో పరుగులమందు కలిపి ఆమె తిని, పిల్లలకు తినిపించింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె చనిపోగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు తల్లి ప్రసన్న(40), కుమార్తె మేఘన(13)గా పోలీసులు గుర్తించారు. 2 నెలల కిందట ప్రసన్న భర్త గుండెపోటుతో చనిపోయాడు.