NDL: ఉయ్యాలవాడ (M) తుడుములదిన్నెలో సురేంద్ర అనే వ్యక్తి మద్యం మత్తులో తన 3 పిల్లలను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలను కావ్య(7), రాజేశ్వరి(4), సూర్యగగన్(2)గా పోలీసులు గుర్తించారు. అయితే, 8 నెలల క్రితమే సురేంద్ర భార్య చనిపోయింది. దీంతో తాను చనిపోతే పిల్లలు అనాధులు అవుతారని ఈ నిర్ణయం తీసుకుకున్నట్లు తెలుస్తోంది.