SRPT: జిల్లా కేంద్రంలో ఎస్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పాలూరి అంజయ్యతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.