AP: జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. తోకల హృతిక్ రెడ్డి అనే యువకుడు ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. ఈ క్రమంలో హృతిక్ రెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆయన బిల్డింగ్ నుంచి దూకేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.