JN: నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. దేవరుప్పుల మండలం నల్లకుంట తండా సర్పంచ్‌గా ఎన్నికైన బానోతు మహేందర్‌కు ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.