NRPT: నారాయణపేట మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితా విడుదలయిందని కమిషనర్ నర్సయ్య తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, జాబితాను కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలలో అందుబాటులో ఉంచారు. మొత్తం 24 వార్డులకు సంబంధించిన జాబితాను సిబ్బంది పరిశీలించగలరని పేర్కొన్నారు.