VSP: పోర్టు స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వాలీబాల్, బాక్సింగ్, బాస్కెట్బాల్లో శిక్షణ పొందుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోర్టు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడల్స్ అందజేశారు. అధ్యక్షుడు ఎస్. ప్రసాదరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో నగదు బహుమతులు ఇస్తానన్నారు.