GNTR: 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పొన్నూరు పట్టణంలో ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి కె. రత్నబాబు, AITUC పొన్నూరు పట్టణ కార్యదర్శి జంపని గోవిందరాజు, మిక్కిలి బాబురావు, ట్రెజరర్ సుబ్బయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు ఆరేటి రామారావు తదితరులు పాల్గొన్నారు.