NZB: చందూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లోని ఎరువుల గోదాములను మండల వ్యవసాయ అధికారి కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలు, నిల్వల రికార్డులను తనిఖీ చేసి, రైతులకు అవసరమైన ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఎక్కడా యూరియా కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు నిల్వలు తెప్పించి రైతులకు పంపిణీ చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.