MNCL: కష్టపడి చదివితే జీవిత లక్ష్యాలను సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ దండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ సూచించారు. దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన సోహెల్ ఖాన్ ఇటీవల సర్వేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆయనను గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.