యంగ్ హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి 5న ‘ఫస్ట్ సింగిల్’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.