SRCL: గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు పారిశుద్ధ్య కార్మికులతో భూమి పూజ చేసి ఆ సర్పంచ్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో రూ.35 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. సర్పంచ్ బుచ్చగారి రాకేష్ గౌడ్ గురువారం పారిశుద్ధ్య కార్మికులతో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయించారు.