SKLM: పింఛన్దారులు జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాలు ఫిబ్రవరి 28లోపు అందజేయాలని ఆమదాలవలస ఉప ఖజానా అధికారి బట్న కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోపు జీవన్ ప్రమాణం యాప్, నెట్ సెంటర్, ఏ ట్రెజరీ కార్యాలయంలో నైనా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చని పేర్కొన్నారు.