KMM: యూరియా కొరత లేదని, 2 లక్షల టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 4 లక్షల టన్నులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులు ఎరువుల కోసం తెల్లవారుజామునే చలిలో క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.