కృష్ణా: గుడివాడ జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరగాయి. గుడివాడ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్‌కు నేతలు పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. కానున్న కాలంలో గుడివాడ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.