SRCL: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ సర్పంచ్ షేక్ యాస్మీన్ ఫిరోజ్ పాషా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు బావుసాయిపేటలో పల్లె ఆసుపత్రి మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పల్లె ఆసుపత్రికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.