TG: రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిందని HYD వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ర్టంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమ గాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని పేర్కొంది. 2, 3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందని వెల్లడించింది. నాలుగో రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై.. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది.