TG: న్యూఇయర్ వేడుకలకు గోవా నుంచి హైదరాబాద్కు కొకైన్ సరఫరా అయినట్లు పోలీసుల తనిఖీల్లో తెలిసింది. HYD నార్సింగిలోని గోల్డెన్ టెంపుల్ వద్ద ఎస్వోటీ పోలీసుల సోదాల్లో బయటపడింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.