రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో సరికొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.