వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇవాళ ప్రత్యేక పరివర్తన కార్యక్రమం నిర్వహించబడింది. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హాజరై 19 మంది పై ఉన్న రౌడీషీట్లు తొలగిస్తూ.. తొలగింపు పత్రాలను అందించారు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా సత్పరివర్తన జీవితం కొనసాగిస్తే రౌడీషీట్లు తొలగిస్తామని కమిషనర్ తెలిపారు.