AKP: ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు వైసిపి క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు చిక్కాల రామారావు పాల్గొన్నారు.