VZM: మహనీయుల జీవితాలు సమాజానికి ఆదర్శప్రాయమని, వారి జీవిత చరిత్రలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంఈవో బూసి నాయుడు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గురువారం చీపురుపల్లి బాలికల ఉన్నత, బాలుర ఉన్నత పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పూలే ఆనాటి సమాజంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారన్నారు.