NLG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు ఇవాళ రాజీనామా చేశారు. ఆరోగ్య రీత్యా ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు సమాచారం. గత ఏప్రిల్ 30న ఐఏఎస్ హోదాలో ఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 31న రిటైర్మెంట్ తీసుకోవాల్సిన ఆయనను తిరిగి ఈవో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.