AP: ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ఈ ఘటన విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి గునపం, రాడ్డులతో శివలింగాన్ని విచ్చిన్నం చేశాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే నిందితుడిని గుర్తించారని అన్నారు. వైసీపీ హయాంలో ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు.