KRNL: ఆదోని మండలం పాండవగల్లు నుంచి కుప్పగల్ రైల్వే స్టేషన్ వరకు లింక్ రోడ్డును బీటీ రోడ్డుగా నిర్మించాలని సీపీఎం మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేశారు. గురువారం పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశులుకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణంతో ఉరుకుంద, కౌతాళం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు దూరం తగ్గి ప్రయోజనం కలుగుతుందని, తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.