MDK: కాంగ్రెస్ పార్టీ ద్వారానే రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు అన్నారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, 12 వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.